వాట్సాప్‌లో చాలా మందికి తెలియని షార్ట్ కట్.. దీంతో మీ టైం ఆదా!

How To Add Chat Shortcut In WhatsApp: వాట్సాప్ వాడుతున్నవారిలో చాలా మందికి ఈ షార్ట్ కట్ గురించి తెలియదు. పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. ఈ షార్ట్ కట్ వల్ల మీకు టైం అనేది ఆదా అవుతుంది. మరి ఆ షార్ట్ కట్ ఏంటో తెలుసుకోండి.

How To Add Chat Shortcut In WhatsApp: వాట్సాప్ వాడుతున్నవారిలో చాలా మందికి ఈ షార్ట్ కట్ గురించి తెలియదు. పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. ఈ షార్ట్ కట్ వల్ల మీకు టైం అనేది ఆదా అవుతుంది. మరి ఆ షార్ట్ కట్ ఏంటో తెలుసుకోండి.

వాట్సాప్ అనేది ఇప్పుడు నిత్యావసర సరుకు అయిపోయింది. వ్యక్తిగత చాటింగ్ కోసమైనా, వ్యాపార అవసరాల కోసమైనా వాట్సాప్ ఉండాల్సిందే. వాట్సాప్ ద్వారానే బిజినెస్ కాంటాక్ట్ లు, కాంట్రాక్ట్ లు, వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే వాట్సాప్ లో వందల కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ ఎంతమంది ఉన్నా డైలీ ఒకరిద్దరితో తరచుగా చాటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా, సంతోషం కలిగినా వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులతో పంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లతో గబుక్కున ఏదైనా ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలంటే వాట్సాప్ లోకి వెళ్లి సెర్చ్ బాక్స్ లో వాళ్ళ నంబర్ లేదా పేరు టైప్ చేయాలి. లేదా కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి.

వాట్సాప్ లో కొత్తగా మెసేజులు వస్తే మీకు ముఖ్యమైన వ్యక్తుల ప్రొఫైల్స్ కిందకు వెళ్లిపోతాయి. స్క్రోల్ చేసుకోవాలన్నా ఇబ్బందే.. సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి వెళ్లాలన్నా ఇబ్బందే. కొన్నిసార్లు ఆఫీస్ కి సంబంధించిన గ్రూప్స్ లో స్పందించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు గ్రూప్స్ పేర్లు ఎన్నని గుర్తు ఉంటాయి. ఇందుకోసం వాట్సాప్ లో పిన్ ఆప్షన్ ఉన్నా గానీ మూడు కంటే ఎక్కువ ప్రొఫైల్స్ లేదా గ్రూప్స్ ని పిన్ చేసుకోవడం కుదరదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే ఈ షార్ట్ కట్. 

ఈ షార్ట్ కట్ ని మీరు మీ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్ గా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరితో అయితే తరచుగా ఎక్కువగా చాట్ చేస్తూ ఉంటారో వారి ప్రొఫైల్ ని హోమ్ స్క్రీన్ షార్ట్ కట్ గా ఎంపిక చేసుకోవచ్చు. దీని వల్ల మీరు వాట్సాప్ లోకి వెళ్లే పని ఉండదు. వాట్సాప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి మీ ఫ్రెండ్ లేదా గ్రూప్ ని వెతుక్కునే పని ఉండదు. జస్ట్ హోమ్ స్క్రీన్ మీద ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న షార్ట్ కట్ మీద క్లిక్ చేస్తే చాలు. మీరు నేరుగా మీరు ఎంచుకున్న వ్యక్తి లేదా గ్రూప్ చాట్ లోకి వెళ్ళిపోతారు. 

షార్ట్ కట్ క్రియేట్ చేయడం ఎలా?:

  • ముందుగా మీరు వాట్సాప్ లోకి వెళ్ళాలి. 
  • ఎవరితో అయితే ఎక్కువగా తరచుగా చాట్ చేస్తారో.. ఆ వ్యక్తి ప్రొఫైల్ మీద ఫింగర్ ని హోల్డ్ చేసి పట్టుకుంటే పైన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. 
  • 1, పిన్, డిలీట్, మ్యూట్ నోటిఫికేషన్స్, ఆర్చివ్ ఐకాన్స్ పక్కన మూడు డాట్స్ కనబడతాయి. 
  • ఆ డాట్స్ మీద ట్యాప్ చేస్తే మీకు ఫస్ట్ రోలోనే ‘యాడ్ చాట్ షార్ట్ కట్’ ఆప్షన్ కనబడుతుంది. 
  • దాని మీద క్లిక్ చేస్తే యాడ్, క్యాన్సిల్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి. యాడ్ మీద క్లిక్ చేస్తే స్మార్ట్ ఫోన్ లోని హోమ్ స్క్రీన్ మీద ఆ వ్యక్తి లేదా గ్రూప్ అనేది యాడ్ అవుతుంది.
  • ఇలా కూడా చేయవచ్చు: మీరు ఏ వ్యక్తి లేదా గ్రూప్ షార్ట్ కట్ ని క్రియేట్ చేయాలనుకున్నారో ఆ ప్రొఫైల్ లోకి వెళ్లి పైన కనిపించే మూడు డాట్స్ మీద ట్యాప్ చేస్తే మోర్ కనబడుతుంది. మోర్ లోకి వెళ్తే లాస్ట్ లో యాడ్ షార్ట్ కట్ ఆప్షన్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేసి కూడా హోమ్ స్క్రీన్ మీద చాట్ షార్ట్ కట్ ని యాడ్ చేసుకోవచ్చు.

ఇలా ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని గ్రూప్స్ నైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ కలిపి ఒకే గ్రూప్ గా ఒక ఫోల్డర్ లో హోమ్ స్క్రీన్ మీదనే పెట్టుకోవచ్చు. దీని కోసం ఒక షార్ట్ కట్ మీద హోల్డ్ చేసి పట్టుకుని మరొక షార్ట్ కట్ మీద వదిలేస్తే గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. మీ ఫోన్ లోని హోమ్ బటన్ ట్యాప్ చేస్తే వచ్చే హోమ్ స్క్రీన్ మీదకు ఆ షార్ట్ కట్ ని డ్రాగ్ చేసుకుంటే చాలు. మీరు ఈజీగా మీరు తరచుగా టచ్ లో ఉండే వ్యక్తులతో లేదా గ్రూప్స్ లో చాట్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తే కనుక కథనాన్ని షేర్ చేయండి.

Show comments