iDreamPost
android-app
ios-app

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. నెలకు రూ. 60 వేల జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 60 వేల వేతనాన్ని పొందొచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 60 వేల వేతనాన్ని పొందొచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. నెలకు రూ. 60 వేల జీతం

మీరు చదువు పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది ఐటీపీఓ. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కింద యంగ్ ప్రొఫెషనల్స్ పలు పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో భాగంగా ఐటీపీఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు ఐటీపీఓ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు నవంబర్ 19, 2023లోపు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ముఖ్యమైన సమాచారం:

పోస్ట్ పేరు – యంగ్ ప్రొఫెషనల్

ఖాళీలు – 20

అర్హత

అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి కనీసం 70% మార్కులతో బీఈ/బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఐటీ/కంప్యూటర్ సైన్స్) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్/ఎంబీఏ లేదా తత్సమాన గ్రేడ్ లేదా రెండేళ్లు

విద్యార్హత తర్వాత, ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/సీపీఎస్ఈ/అటానమస్ బాడీ/యూనివర్శిటీ/రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వబడుతుంది.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 60,000 అందించబడుతుంది.

దరఖాస్తు విధానం

అవసరమైన డాక్యుమెంట్లతో పాటు నిర్ణీత ఫార్మాట్‌లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 19 నవంబర్ 2023లోపు “ఐటిపిఓలో యంగ్ ప్రొఫెషనల్ కోసం దరఖాస్తు” అనే సబ్జెక్ట్ కింద nsrwatt@itpo.gov.inకి ఈమెయిల్ ద్వారా అవసరమైన ఎన్‌క్లోజర్‌లతో పాటు సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్ యొక్క పీడీఎఫ్ ఫైల్‌ను సమర్పించాలి. వివరాల కోసం వెబ్ సైట్ ; https://indiatradefair.com పరిశీలించగలరు.