iDreamPost

UIDAIలో ఉద్యోగాలు.. నెలకు రూ. 1.80 లక్షల వరకు జీతం

డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి శుభవార్త. ఆధార్ కార్డ్స్ ను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి శుభవార్త. ఆధార్ కార్డ్స్ ను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

UIDAIలో ఉద్యోగాలు.. నెలకు రూ. 1.80 లక్షల వరకు జీతం

మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా సీనియర్ అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ వంటి పోస్టులను సంస్థ భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 1 లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు

మొత్తం 10 పోస్టులు. వాటిల్లో నాలుగు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, నాలుగు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టలు ఒకటి చొప్పున ఉన్నాయి.

అర్హతలు

టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ చదివిన వారు కూడా అర్హులే. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేసి ఉండాలి. సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఛార్టెడ్ అకౌంటెంట్, కాస్డ్ అకౌంటెంట్, ఎంబీఏ(ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి

అభ్యర్థుల వయసు 56 ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం

అర్హత ఉన్న అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్‌ను దరఖాస్తు ఫారమ్‌కు జత చేసి డైరెక్టర్ (హెచ్ఆర్), యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ), బంగ్లా సాహిబ్ రోడ్, కాళీ మందిర్ బ్యాక్ సైడ్, గోలే మార్కెట్, న్యూఢిల్లీ-110001 అనే అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను డిప్యుటేషన్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.

జీతం

టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.20,600 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.14,900 నుంచి రూ.71,000; ప్రైవేట్ సెక్రటరీకి రూ.20,600 నుంచి రూ.1,60,000; సీనియర్ అకౌంట్ ఆఫీసర్‌కు రూ.24,900 నుంచి రూ. 1,80,000 వరకు జీతం అందించబడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి