iDreamPost
android-app
ios-app

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? త్రివిధ దళాల్లో భారీగా ఉద్యోగాలు.. మహిళలకు ఛాన్స్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. త్రివిధ దళాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. త్రివిధ దళాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? త్రివిధ దళాల్లో భారీగా ఉద్యోగాలు.. మహిళలకు ఛాన్స్

దేశాన్ని శత్రు దేశాల నుంచి, ఉగ్ర వాద దాడుల నుంచి రక్షించడంలో త్రివిధ దళాలదే కీలక పాత్ర. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరేందుకు యూత్ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇలాంటి ఉద్యోగాలు సాధిస్తే దేశానికి సేవ చేసే అకాశంతో పాటు, మంచి వేతనంతో జీవితంలో స్థిరపడిపోవచ్చు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మరి మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? భారత రక్షణ రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మహిళలు కూడా అర్హులే.

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్ఈ) ఎగ్జామినేష‌న్(II)-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 459 ఉద్యోగాలను ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అవివాహిత పురుష, మహిళా జూన్ 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్‌) ఎగ్జామినేష‌న్ (II)-2024

ఖాళీల సంఖ్య:

459

ఖాళీల వివరాలు:

ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, డెహ్రాడూన్: 100

ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ల‌: 32

ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్: 32

ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (మెన్), చెన్నై, ఓటీఏ ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్: 276

ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఉమెన్), చెన్నై, ఓటీఏ ఎస్ఎస్సీ ఉమెన్ నాన్ టెక్నికల్: 19

అర్హత‌:

డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. నేవల్ అకాడమీ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టుల భర్తీకి డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌, మ్యాథ‌మెటిక్స్ స‌బ్జెక్టుల‌ు చదివి ఉండాలి.

వయోపరిమితి:

25 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తు ఫీజు:

రూ.200 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

ఎంపిక‌ విధానం:

రాత ప‌రీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

15-05-2024

దరఖాస్తు చివరి తేదీ:

04-06-2024