iDreamPost
android-app
ios-app

Group-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ ప‌రీక్ష‌ల తేదీలు వచ్చేశాయ్..

గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏ తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయంటే?

గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏ తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయంటే?

Group-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ ప‌రీక్ష‌ల తేదీలు వచ్చేశాయ్..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. గ్రూప్ 1,2,3, కింద పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా 11 వేల పైచిలుకు పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక గత ప్రభుత్వ హయాంతో గ్రూప్ 1 జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాగా దానికి సంబంధించిన ప్రిలిమరీ పరీక్షలో జరిగిన అవకతవకల కారణంగా ఆ పరీక్షను రద్దు చేశారు. ఆ తర్వాత నోటిఫికేషన్ ను కూడా క్యాన్సిల్ చేసి రీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహించారు అధికారులు. తాజాగా మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ కోసం సన్నద్దమయ్యే వారికి బిగ్ అలర్ట్. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ రీలీజ్ చేసింది. అక్టోబ‌ర్ 21వ తేదీ నుంచి 27 వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంల‌లో మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి పేప‌ర్ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. కాగా గ్రూప్ 1 కు సంబంధించిన ప్రిలిమరీ పరీక్ష ఈ నెల 09న జరుగింది. ఈ నెల 9వ తేదీన ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఓఎంఆర్ విధానంలో రాత ప‌రీక్ష నిర్వ‌హించారు. త్వరలో ఫలితాలు వెల్లడికానున్నాయి. గ్రూప్ 1 కింద పలు విభాగాల్లో 563 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి సచాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే:

  • అక్టోబ‌ర్ 21 – జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్)
  • అక్టోబ‌ర్ 22 – పేప‌ర్ 1(జ‌న‌ర‌ల్ ఎస్సే)
  • అక్టోబ‌ర్ 23 – పేప‌ర్ 3(హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ)
  • అక్టోబ‌ర్ 24 – పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌)
  • అక్టోబ‌ర్ 25 – పేప‌ర్ 4(ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్)
  • అక్టోబ‌ర్ 26 – పేప‌ర్ 5(సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్)
  • అక్టోబ‌ర్ 27 – పేప‌ర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్)