iDreamPost

Group2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్.. వెంటనే ఈ పని చేసుకోండి

గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తుల్లో వివరాలు సరిచేసుకునేందుకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ నేటితో ముగియనుంది. వెంటనే ఈ పని చేసుకోండి.

గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తుల్లో వివరాలు సరిచేసుకునేందుకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ నేటితో ముగియనుంది. వెంటనే ఈ పని చేసుకోండి.

Group2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్.. వెంటనే ఈ పని చేసుకోండి

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే గ్రూప్ 4 కు సంబంధించిన పోస్టులకు అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతున్నది. మరోవైపు గ్రూప్ 1,2,3 మెగా డీఎస్సీ ఉద్యోగాల కోసం భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022-డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలచేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తులో నమోదు చేసిన వివరాల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ అవకాశం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది.

గ్రూప్ 2 పరీక్షలు గతేడాదే పూర్తి కావాల్సింది. కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కాణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. 2024, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జాబ్ సాధించడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నమోదుచేసిన వివరాల్లో తప్పుల సవరణకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది.

ఈ ప్రక్రియ జూన్ 16న ప్రారంభంకాగా.. నేడు అనగా జూన్ 20న సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. అంటే గ్రూప్ 2 అభ్యర్థులకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు మరొకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు తమ వివరాలను సరిచేసుకోని వారు ఉంటే వెంటనే ఈ పని చేయండి. లేకపోతే ఎడిట్ చేసుకునేందుకు మరో అవకాశం ఉండదని టీజీపీఎస్సీ వెల్లడించింది. వివరాలను ఎడిట్ చేసుకోదలిచిన వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గ్రూప్-2 పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 783

  • మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11
  • అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59
  • నాయబ్ తహసిల్దార్: 98
  • సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09
  • మండల్ పంచాయత్ ఆఫీసర్: 126
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97
  • అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02
  • డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11
  • అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17
  • అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09
  • అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి