iDreamPost

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా?.. టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. మిస్ చేసుకోకండి

డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.

డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా?.. టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. మిస్ చేసుకోకండి

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక్షణం జాబ్ పోతుందో తెలియక ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరల్డ్ వైడ్ గా దిగ్గజ ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపాల మదిరిగా అయిపోయాయి. ఉన్నపలంగా జాబ్ పోతే ఎలా బ్రతకాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఐటీ ఎంప్లాయీస్ దిగుల చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా గుడ్ న్యూస్ అందించింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

ఇటీవల దేశీయ టెక్ దిగ్గజాలు అయినటువంటి ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇంకా ఇతర సంస్థలు కొత్త నియామకాలను చేపట్టకపోగా ఉన్న ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ రంగంలోకి రావాలనుకునే బీటెక్ డిగ్రీ కలిగిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా మాత్రం సీనియర్‌ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 5 నుంచి 12 ఏళ్ల వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఉండాలి. ఎస్‌ఏపీ, ఐఎస్‌యూ బిల్లింగ్‌ అండ్‌ ఏఎంపీ ఇన్‌వాయిసింగ్‌-1, బిజినెస్‌ మాస్టర్‌ డేటా తదితరాల్లో నైపుణ్యాలు ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఎస్‌ఏపీ ఎస్‌/ 4హెచ్‌ఏఎన్‌ఏ, సెంట్రల్‌ ఫైనాన్స్‌-2 పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో 6 నుంచి 12 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి. ఎస్‌/ 4 హెచ్‌ఏఎన్‌ఏ-1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్కిల్స్‌ కలిగి ఉండాలి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి