iDreamPost

TCS సంచలనం.. ఒక్క పరీక్ష పాసైతే చాలు.. 1.6 లక్షల ఉద్యోగాలకు అర్హత!

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ కోసం నేషనల్ క్వాలిఫయర్ టెస్టును నిర్వహించబోతోంది. ఈ పరీక్షలో ప్రతిభ చూపితే చాలు దాదాపు 1.6 లక్షల ఉద్యోగాలకు అర్హత సాధించొచ్చు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ కోసం నేషనల్ క్వాలిఫయర్ టెస్టును నిర్వహించబోతోంది. ఈ పరీక్షలో ప్రతిభ చూపితే చాలు దాదాపు 1.6 లక్షల ఉద్యోగాలకు అర్హత సాధించొచ్చు.

TCS సంచలనం.. ఒక్క పరీక్ష పాసైతే చాలు.. 1.6 లక్షల ఉద్యోగాలకు అర్హత!

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించింది టీసీఎస్. బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారికి గోల్డెన్ అవకాశాన్ని కల్పిస్తోంది. లక్షల ఉద్యోగాలకు అర్హత సాధించేలా ఓ పరీక్షను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ ‘డిజిటల్ హైరింగ్’ కోసం ఎన్ క్యూటీ పరీక్షను నిర్వహించబోతోంది. ఈ నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ఉత్తీర్ణులైన వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

టీసీఎస్ నెషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ కనబరిస్తే టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో, ఏసియన్ పెయింట్స్ సహా దాదాపు 2700 ఐటీ, 150 ఐటీయేతర కార్పొరేట్ సంస్థల్లో సేల్స్ ఎక్సిక్యూటివ్, బిజినెస్ అనలిస్ట్, హెచ్ ఆర్ స్పెషలిస్టు, 23 ఇండస్ట్రీస్.. ఐటీ, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎమ్ సీజీ, ఎడ్ టెక్ ఇలా దాదాపు 1.6 లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం దక్కనుంది. కంపెనీలు, ఉద్యోగాలను బట్టి గరిష్ఠంగా రూ.19 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్ 27లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 9న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాలి. https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/.

అర్హతలు?

టీసీఎస్ ఎన్క్యూటీ పరీక్ష రాసేందుకు 2018 – 2024 మధ్య పాసైన ఇంజినీరింగ్ విద్యార్థులతోపాటు డిగ్రీ, పీజీ, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

విద్యార్థుల వయసు 17 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

ఆన్ లైన్

ఎంపిక విధానం:

టీసీఎస్ ఎన్ క్యూటీ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా, సంస్థల నిర్ణయం మేరకు ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.

పరీక్ష వివరాలు..

దేశవ్యాప్తంగా నిర్దేశించిన వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రతి 4 వారాలకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఇంగ్లిష్లో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు.

వ్యాలిడిటీ

టీసీఎస్ ఎన్ క్యూటీలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వరకే వ్యాలిడిటీ ఉంటుంది. స్కోరును మెరుగుపరుచుకొనేందుకు ఎన్నిసార్లయినా పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. ఈ పరీక్షలో వచ్చిన స్కోరును ఆధారంగానే.. కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.11.2023.

టీసీఎస్ ఎన్ క్యూటీ పరీక్షతేది: 09.12.2023.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి