iDreamPost

ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్.. దిగ్గజ కంపెనీలు చేతులెత్తేసినా అక్కున చేర్చుకుంటున్న స్టార్టప్ కంపెనీలు

Startup Companies For Freshers: చాలా మందికి నచ్చని పదం లేఆఫ్స్. లేఆఫ్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మా వల్ల కాదు అని చేతులెత్తేసిన దిగ్గజ సంస్థలకు బదులు స్టార్టప్ కంపెనీలు ఫ్రెషర్స్ ని అక్కున చేర్చుకుంటున్నాయి.

Startup Companies For Freshers: చాలా మందికి నచ్చని పదం లేఆఫ్స్. లేఆఫ్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మా వల్ల కాదు అని చేతులెత్తేసిన దిగ్గజ సంస్థలకు బదులు స్టార్టప్ కంపెనీలు ఫ్రెషర్స్ ని అక్కున చేర్చుకుంటున్నాయి.

ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్.. దిగ్గజ కంపెనీలు చేతులెత్తేసినా అక్కున చేర్చుకుంటున్న స్టార్టప్ కంపెనీలు

ప్రస్తుతం ఎక్కడ విన్నా లేఆఫ్స్ మాటే వినిపిస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం లేఆఫ్స్ పేరుతో భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గత మూడేళ్ళుగా ఇదే పరిస్థితి. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. ఈ కారణంగా చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటుంటున్నారు. ఐటీ రంగంలో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి కారణంగా దిగ్గజ కంపెనీలు వరసపెట్టి షాక్ ఇస్తున్నాయి. ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు ఊడుతుంటే ఇక ఫ్రెషర్స్ పరిస్థితి అంటే ఘోరమనే చెప్పాలి. ఉద్యోగమా.. ఇక్కడ సీనియర్స్ కే దిక్కులేదు ఇక ఫ్రెషర్స్ కి కూడానా. ఎల్లెల్లే అని బయటకు గెంటివేసే పరిస్థితి. కానీ ఇది నిన్నటి మాట.

ప్రస్తుతం దిగ్గజ సంస్థలు చేయని పని స్టార్టప్ కంపెనీలు చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రస్తుతం స్టార్టప్స్ చేస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి టెక్నాలజీస్ లో నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్ ని నియమించుకునేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఫౌండిట్ సర్వే ప్రకారం గత ఏడాదిలో స్టార్టప్ ల సంఖ్య 37 శాతానికి పెరిగింది. ఉద్యోగ నియామకాలు కూడా 14 శాతం వృద్ధి చెందినట్లు సర్వేలో తేలింది. దేశంలో ఉన్న దాదాపు అన్ని స్టార్టప్ కంపెనీలో సగానికి పైగా ఫ్రెషర్స్ ని నియమించుకుంటుండడం విశేషం. ఐటీ రంగంలో ఫ్రెషర్స్ నియామకాల్లో 23 శాతం వృద్ధి కనిపించగా.. ఎడ్ టెక్, ఫిన్ టెక్, మీడియా వంటి రంగాల్లో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్స్ భారీగా పెరుగుతున్నాయి.

ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాల్లో కూడా భారీగా ఫ్రెషర్స్ నియామకాలు జరుగుతున్నాయి. ప్రముఖ మోతిలాల్ ఓస్వాల్ సంస్థ కూడా దాదాపు 500 మందిని క్యాంపస్ నుంచి నియమించుకుంది. ఈ స్థాయిలో స్టార్టప్ కంపెనీలు ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి కారణం ఉంది. పెద్ద మొత్తంలో జీతాలకు ఖర్చు పెట్టి అనుభవం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడం కంటే తక్కువ జీతానికి అనుభవం లేకపోయినా స్కిల్స్ ఉండే ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అని దిగ్గజ కంపెనీలు ఇలా ఆలోచిస్తున్నాయి. పైగా కొత్త ఆలోచనలను ఒక వేదికను కల్పించినట్లు అవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు చేతులెత్తేసిన సమయంలో స్టార్టప్ కంపెనీలు ఫ్రెషర్స్ ని అక్కున చేర్చుకుంటున్నాయి. కాబట్టి ఫ్రెషర్స్ కి ఇది మంచి అవకాశం. స్టార్టప్ కంపెనీలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మీ దగ్గర స్కిల్స్ ఉంటే చాలు.. అనుభవం లేకపోయినా మిమ్మల్ని నియమించుకుంటాయి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి