iDreamPost
android-app
ios-app

రైల్వేలో 4,660 పోలీస్‌ ఉద్యోగాలు! పరీక్షకు హాజరైతే చాలు! ఇది లక్కీ ఛాన్స్!

  • Published Apr 15, 2024 | 4:23 PM Updated Updated Apr 15, 2024 | 11:11 PM

ప్రభుత్వ ఉద్యోగోలు సాధించాలనే ఆసక్తి ప్రతిఒక్కరిలో కొలువై ఉంటుంది. అందుకోసం ఎంతోమంది నిరుద్యోగులు సరైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం తాజాగా రైల్వేశాఖ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ప్రభుత్వ ఉద్యోగోలు సాధించాలనే ఆసక్తి ప్రతిఒక్కరిలో కొలువై ఉంటుంది. అందుకోసం ఎంతోమంది నిరుద్యోగులు సరైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం తాజాగా రైల్వేశాఖ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

  • Published Apr 15, 2024 | 4:23 PMUpdated Apr 15, 2024 | 11:11 PM
రైల్వేలో 4,660 పోలీస్‌ ఉద్యోగాలు! పరీక్షకు హాజరైతే చాలు! ఇది లక్కీ ఛాన్స్!

ప్రభుత్వ ఉద్యోగోలు సాధించాలనే ఆసక్తి ప్రతిఒక్కరిలో కొలువై ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమనేది అంత కష్టమైన పని కాదు. మనలో సాధించాలనే ధృడ సంకల్పం పట్టుదల ఉంటే.. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలను అయిన ఈజీగా సంపాదించవచ్చు. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే చాలామంది నిరుద్యోగులు నిరంతరం కష్టపడి, కోచింగ్ లు తీసుకుంటు అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటారు. మరి అలాంటి నిరుద్యోగుల కోసం తాజాగా మరో కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఎప్పటినుంచే రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. కాగా, ఇటీవలే దాదాపు 14వేలకు పైగా పలు ఉద్యోగాలకు దరఖాస్తులకు ఆహ్వానించిన రైల్వేశాఖ.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎప్పటినుంచే రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. తాజాగా రైల్వేశాఖ మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) , రైల్వే ప్రొడెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైంది. ఇక అర్హులై, ఆసక్తికలిగిన అభ్యర్థులకు ఏప్రిల్‌ 15 నుంచి మే 14వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.రాత పరీక్ష, దేహధారుడ్య, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rpf.indianrailways.gov.in/RPF వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్యమైన సమాచారం:
ఆర్​పీఎఫ్ లో మొత్తం ఉద్యోగాలు:

  • మొత్తం పోస్టులు 4,660.
  • 4,208 కానిస్టేబుల్‌,
  • 452 ఎస్సై

విద్యా అర్హత

  • కానిస్టేబుల్ పోస్టులకు  దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం.
    వయో పరిమితి:
  • 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. అలాగే ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఇస్తారు.
    ఎంపిక విధానం:
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్‌ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
    అప్లికేషన్ ఫీజు:
  • ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500 ఉంటుంది. ఇక పరీక్షకు హాజరైతే రూ.400 రిఫండ్‌ చేస్తారు.
    దరఖాస్తు విధానం:
  • ఆన్ లైన్
    దరఖాస్తు ప్రారంభం:
  • ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు
    వేతనం:
  • ఎస్సై పోస్టులకు రూ.35,400 వరకు ఉంటుంది. ఇక  కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700 చొప్పున ప్రారంభ వేతనంగా ఇస్తారు.
    అలాగే రీజియన్ల వారీగా ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు భర్తీ చేసే ఉద్యోగ ఖాళీల సంఖ్య, పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.