iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 6,128 Bank జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

IBPS Clerk recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 6 వేలకు పైగా బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ పాసైతే చాలు. వెంటనే అప్లై చేసుకోండి.

IBPS Clerk recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 6 వేలకు పైగా బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ పాసైతే చాలు. వెంటనే అప్లై చేసుకోండి.

డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 6,128 Bank జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ దాదాపు 10 వేల బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐబీపీఎస్ నుంచి మరో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వందలు కాదు ఏకంగా 6 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంకు జాబ్స్ లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నవారికి ఇదే మంచి అవకాశం. డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాన్ని సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. మిస్ చేసుకోకండి.

2025-2026 సంవత్సరానికి సంబంధించి దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జులై 21 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 6,128.

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు:

  • అండమాన్ నికోబార్: 01
  • ఆంధ్రప్రదేశ్: 105
  • అరుణాచల్ ప్రదేశ్: 10
  • అస్సాం: 75
  • బిహార్: 237
  • చండీగఢ్: 39
  • ఛత్తీస్ గఢ్: 119
  • దాద్రానగర్ హవేలీ: 05
  • ఢిల్లీ: 268
  • గోవా: 35
  • గుజరాత్: 236
  • హర్యానా: 190
  • హిమాచల్ ప్రదేశ్: 67
  • జమ్మూ కశ్మీర్: 20
  • జార్ఖండ్: 70
  • కర్ణాటక: 457
  • కేరళ: 106
  • లడఖ్: 03
  • మధ్యప్రదేశ్: 354
  • మహారాష్ట్ర: 590
  • మణిపూర్: 06
  • మేఘాలయ: 03
  • మిజోరం: 03
  • నాగాలాండ్: 06
  • ఒడిశా: 107
  • పుదుచ్చేరి: 08
  • పంజాబ్: 404
  • రాజస్థాన్: 205
  • సిక్కిం: 05
  • తమిళనాడు: 665
  • తెలంగాణ: 104
  • త్రిపుర: 19
  • ఉత్తర్ ప్రదేశ్: 1246
  • ఉత్తరాఖండ్: 29
  • వెస్ట్ బెంగాల్: 331

అర్హత‌:

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి:

  • 01.07.2024 నాటికి 20-28 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.07.1996 – 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 01-07-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:

  • 21-07-2024