iDreamPost

డిగ్రీ పాసయ్యారా? ఈ ఉద్యోగాలకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. కాంపిటీషన్ తక్కువ

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పోటీ చాలా తక్కువ. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పోటీ చాలా తక్కువ. వెంటనే అప్లై చేసుకోండి.

డిగ్రీ పాసయ్యారా? ఈ ఉద్యోగాలకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. కాంపిటీషన్ తక్కువ

మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. కాంపిటీషన్ తక్కువగా ఉండే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ కొలువులు కాబట్టి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడిపోవచ్చు. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా కేంద్ర విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 312 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.

డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూన్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 30 నుంచి 50 ఏళ్లు వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 312

విభాగాల వారీగా ఖాళీలు:

డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలాజికల్ కెమిస్ట్:

  • 04

డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలాజిస్ట్:

  • 67

సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్:

  • 04

స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్:

  • 132

స్పెషలిస్ట్ గ్రేడ్ III:

  • 35

డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్:

  • 09

అసిస్టెంట్ డైరెక్టర్:

  • 04

అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ II:

  • 46

ఇంజినీర్ అండ్ షిప్ సర్వేయర్ కం-డిప్యూటీ డైరెక్టర్ జనరల్:

  • 02

ట్రైనింగ్ ఆఫీసర్:

  • 8

అసిస్టెంట్ ప్రొఫెసర్:

  • 01

అర్హత:

  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, ఇంటర్య్వూ, తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ. 25 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపుకల్పించారు.

దరఖాస్తు చివరి తేదీ:

  • 13-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి