iDreamPost
android-app
ios-app

మళ్లీరాని ఛాన్స్.. రైల్వేలో 8,113 జాబ్స్ మీకోసమే.. ఇప్పుడే అప్లై చేసుకోండి

RRB NTPC Recruitment 2024: రైల్వే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈఛాన్స్ మిస్ చేసుకోకండి. ఏకంగా 8113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు.

RRB NTPC Recruitment 2024: రైల్వే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈఛాన్స్ మిస్ చేసుకోకండి. ఏకంగా 8113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు.

మళ్లీరాని ఛాన్స్.. రైల్వేలో 8,113 జాబ్స్ మీకోసమే.. ఇప్పుడే అప్లై చేసుకోండి

ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి భారీ స్తాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. రైల్వేలో జాబ్ కోసం చూసేవారికి కిక్కిచ్చే వార్త. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఆర్ఆర్ బీ భర్తీ చేయనున్న పోస్లుల్లో 1736 టికెట్‌ సూపర్‌ వైజర్‌, 994 స్టేషన్ మాస్టర్, 3144 గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌, 1507 టైపిస్ట్‌, 732 సీనియర్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు జీతం పొందొచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 8,113

విభాగాల వారీగా ఖాళీలు:

  • కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు: 1,736
  • స్టేషన్ మాస్టర్ పోస్టులు: 994
  • గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు: 3,144
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 1,507
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 732

అర్హత:

  • డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • 01-01-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 14-09-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 13-10-2024