iDreamPost
android-app
ios-app

Bank జాబ్ కోసం ట్రై చేస్తున్నారా?.. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి

Indian Bank Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకోం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Indian Bank Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకోం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Bank జాబ్ కోసం ట్రై చేస్తున్నారా?.. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి

బ్యాంక్ జాబ్స్ కోసం యూత్ తెగ ట్రై చేస్తుంటారు. మంచి జీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు.. అన్నిటికి మించి సెలవులు ఎక్కువగా లభిస్తుండడంతో బ్యాంక్ జాబ్స్ క్రేజ్ ఎక్కువ. అందుకే జాబ్ కొట్టేంత వరకు ఏళ్లకేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. మీర మీరు కూడా బ్యాంక్ జబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 48 వేలు పొందొచ్చు. మరి ఈ జాబ్స్ కు అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు మీకోసం..

ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకోం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ఏపీ, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2024 జులై 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 02 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 300

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.

వయోపరిమితి:

  • 2024 జులై 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.48,480 వరకు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే చాలు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 02-09-2024