iDreamPost
android-app
ios-app

డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి లక్కీ ఛాన్స్.. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్‌లో Jobs రెడీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.

డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి లక్కీ ఛాన్స్.. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్‌లో Jobs రెడీ

బ్యాంక్ జాబ్ సాధించడం మీ లక్ష్యమా? బ్యాంక్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,995 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్‌లో 285 పోస్టులున్నాయి. బ్యాంక్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్‌-ఏ ఆఫీసర్లయిన స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అధికారుల నియామకంతో పాటు గ్రూప్‌-బీలో మల్టీ పర్సస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అర్హతలు:

  • పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.

ఎంపిక విధానం:

  • ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 07-06-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 27-06-2024

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet