P Venkatesh
Combined Hindi Translators Examination 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర జీతం అందుకోవచ్చు.
Combined Hindi Translators Examination 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర జీతం అందుకోవచ్చు.
P Venkatesh
ఈ రోజుల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగం రావాలంటే కనీసం డిగ్రీ అయినా ఉండాలి. డిగ్రీ అర్హతలతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ పొందొచ్చు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు ఇతర స్కిల్స్ ఉన్నా కూడా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సాధించొచ్చు. స్పోర్ట్స్ ఆడేవారు స్పోర్ట్స్ కోటాలో, ట్రాన్స్ లేషన్ స్కిల్ ఉంటే ట్రాన్స్ లేటర్ గా జాబ్ పొందొచ్చు. మరి మీకు కూడా ట్రాన్స్ లేషన్ చేసే స్కిల్ ఉందా? హిందీ, ఇంగ్లీష్ పై పట్టు ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్ లేటర్ జాబ్స్ భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర వరకు జీతం పొందొచ్చు. అభ్యర్థుల వయసు 18-30 ఏళ్లు కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.