iDreamPost
android-app
ios-app

ITI పాసైతే చాలు.. లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్ మిస్ చేసుకోకండి!

గవర్నమెంట్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు జీతం 90 వేలు. వెంటనే అప్లై చేసుకోండి.

గవర్నమెంట్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు జీతం 90 వేలు. వెంటనే అప్లై చేసుకోండి.

ITI పాసైతే చాలు.. లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్ మిస్ చేసుకోకండి!

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందటం చాలా కష్టంగా మారింది. అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్పా జాబ్ వరించదు. జాబ్ సాధించాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు, స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. రాత పరీక్షలను, ఇంటర్వ్యూలను ఎదుర్కొన్నాకే జాబ్ సాధ్యం. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. జాబ్ కొట్టేందుకు ఇదే మంచి సమయం. భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను పొంది లైఫ్ లో సెట్ అయిపోయవచ్చు. మీరు ఐటీఐ పాసైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. హైదరాబాద్ లోని బెల్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

నిరుద్యోగులకు హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బెల్ 32 పోస్టులను భర్తీ చేయనున్నది. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ,టెక్నీషియ్ సీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం, పాసై ఉండాలి. 28 ఏళ్ల వయసు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 11 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 32

విభాగాల వారీగా ఖాళీలు:

ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ:12

టెక్నీషియ్ సీ :17

జూనియర్ అసిస్టెంట్: 03

అర్హత:

  • అభ్యర్థులు ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం, పాసై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • షార్ట్ లిస్ట్, రాత పరీక్ష తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు రూ. 24,500-90000, టెక్నీషియ్ సీ, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ. 21,500-82,000 అందిస్తారు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్/ఓబీసీ/ఈడ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు చివరి తేదీ:

  • 11-07-2024