iDreamPost
android-app
ios-app

10th,ITI పాసైతే లక్కీ ఛాన్స్.. రైల్వేలో 9,144 పోస్టులు.. జాబ్ కొడితే లైఫ్ సెట్!

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 9144 పోస్టులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతతోనే మీరు ఈ ఉద్యోగాలను పొందొచ్చు.

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 9144 పోస్టులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతతోనే మీరు ఈ ఉద్యోగాలను పొందొచ్చు.

10th,ITI పాసైతే లక్కీ ఛాన్స్.. రైల్వేలో 9,144 పోస్టులు.. జాబ్ కొడితే లైఫ్ సెట్!

దేశంలోనే పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను కలిగిన శాఖ ఏదైనా ఉందంటే అది భారతీయ రైల్వే శాఖ మాత్రమే. అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తుంది. ఛార్జీల ధరలు తక్కువ, సమయం ఆదా అవుతుండడంతో ప్రయాణికులు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. అయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు అవసరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంటుంది రైల్వే డిపార్ట్ మెంట్. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

మీరు టెన్త్, ఐటీఐ పాసైతే మీ అంత అదృష్టవంతులు మరెవరుండరు. డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను పొంది జీవితంలో స్థిరపడిపోవచ్చు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించిన 9144 పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ఖాళీలు 1092, టెక్నీషియన్ గ్రేడ్-III 8052 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం https://rrbsecunderabad.gov.in/ను పరీశీలించండి.

ముఖ్యమైన సమాచారం:

టెక్నీషియన్ పోస్టుల సంఖ్య:

  • 9,144

విభాగాల వారీగా ఖాళీలు:

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్:

  • 1,092 పోస్టులు

అర్హత:

  • బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

టెక్నీషియన్ గ్రేడ్-III:

  • 8052 పోస్టులు

అర్హత:

  • పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2024 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రారంభ వేతనం:

  • నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200 చెల్లిస్తారు. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 09-03-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 08-04-2024.

దరఖాస్తుల సవరణ: