iDreamPost
android-app
ios-app

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1511 జాబ్స్.. ఈ అర్హతలున్నవారు మిస్ చేసుకోకండి.. నెలకు 93 వేల జీతం

SBI SO Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ అర్హతలున్న వారు వెంటనే అప్లై చేసుకోండి.

SBI SO Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ అర్హతలున్న వారు వెంటనే అప్లై చేసుకోండి.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1511 జాబ్స్.. ఈ అర్హతలున్నవారు మిస్ చేసుకోకండి.. నెలకు 93 వేల జీతం

బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురును అందించింది. భారీ వేతనంతో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. ఏకంగా 1511 జాబ్స్ ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పోస్టులను అనుసరించి నెలకు 93 వేల వరకు జీతం అందుకోవచ్చు. మీ లైఫ్ ను సెట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. జాబ్ సెర్చ్ లో ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ అర్హతలున్నవారు ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇంకీ ఈ పోస్టులకు ఎవరు అర్హులు అంటే?

ఎస్బీఐ రెగ్యూలర్ ప్రాతిపదికన 1497 పోస్టులను, 14 బ్యాక్ లాగ్ ఖాళీలను కలిపి మొత్తం 1511 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ జాబ్స్ ను భర్తీ చేయనున్నది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను అనుసరించి వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820- రూ.93,960.. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920 ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 04 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీలు మొత్తం: 1,511

విభాగాల వారీగా ఖాళీలు:

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ పోస్టులు: 187
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్ పోస్టులు: 412
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌ పోస్టులు: 80
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్ పోస్టులు: 27
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్టులు: 07
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టులు: 784

బ్యాక్ లాగ్ ఖాళీలు:

  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టులు: 14

అర్హతలు:

  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు.. పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 30.06.2024 తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:

  • నెలకు డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820- రూ.93,960.. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920 ఉంటుంది.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ :

  • 14-09-2024

దరఖాస్తులకు చివరితేదీ :

  • 04-10-2024