iDreamPost
android-app
ios-app

10th పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ Bank ఉద్యోగాలు మీకోసమే.. నెలకు 40000 జీతం!

మీరు పదోతరగతి ఉత్తీర్ణులయ్యారా? అయితే ఈ బ్యాంక్ జాబ్స్ కు వెంటనే అప్లై చేసుకోండి. ప్రముఖ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

మీరు పదోతరగతి ఉత్తీర్ణులయ్యారా? అయితే ఈ బ్యాంక్ జాబ్స్ కు వెంటనే అప్లై చేసుకోండి. ప్రముఖ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

10th పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ Bank ఉద్యోగాలు మీకోసమే.. నెలకు 40000 జీతం!

బ్యాంకు జాబ్స్ కు ఉండే డిమాండే వేరు. యువత బ్యాంక్ జాబ్ సాధించేందుకు ఖచ్చితమైన ప్రణాళికతో ఏళ్లకు ఏళ్లు ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా కోచింగ్ తీసుకుంటుంటారు. బ్యాంక్ జాబ్ కొడితే మంచి వేతనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వహించే వీలుంటుంది. అంతే కాదు సెలవులు భారీగా ఉంటాయి. అందుకే బ్యాంక్ జాబ్స్ కు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. అయితే బ్యాంక్ జాబ్స్ కు డిగ్రీ, పీజీలు పాసైతేనే ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ పదో తరగతి అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? టెన్త్ తో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పది పాసైతే చాలు బ్యాంక్ జాబ్ మీ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్/సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 484 పోస్టులను భర్తీ చేయనున్నారు. 31-03-2023 నాటికి 18-26 ఏళ్ల మధ్య వయసును కలిగి ఉండాలి. టెన్త్ పాసైన వారు జూన్ 27 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 19,500 నుంచి రూ. 37,815 జీతాన్ని అందిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 484

జోన్ల్ వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్ :76

భోపాల్:38

ఢిల్లీ:76

కోల్ కతా:02

లఖ్ నవూ: 78

ఎంఎంజడ్ వో అండ్ పూణే:118

పట్నా: 96

అర్హత:

అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 31-03-2023 నాటికి 18-26 ఏళ్ల మధ్య వయసును కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 19,500 నుంచి రూ. 37,815 జీతాన్ని అందిస్తారు.

ఎంపిక విధానం:

  • ఆన్ లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు రూ. 175. ఇతరుకులకు రూ. 850

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 21-06-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 27-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి