iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసైతే చాలు!.. ఈ బ్యాంక్‌ ఉద్యోగాలు మీకోసమే!.. ఏడాదికి రూ. 6.50 లక్షల జీతం!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మీరు డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు ఈ ఉద్యోగాలు మీకోెసమే. ఎంపికైతే ఏడాదికి రూ. 6.50 లక్షల జీతం అందుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మీరు డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు ఈ ఉద్యోగాలు మీకోెసమే. ఎంపికైతే ఏడాదికి రూ. 6.50 లక్షల జీతం అందుకోవచ్చు.

డిగ్రీ పాసైతే చాలు!.. ఈ బ్యాంక్‌ ఉద్యోగాలు మీకోసమే!.. ఏడాదికి రూ. 6.50 లక్షల జీతం!

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంకు వెయ్యికి పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మీరు డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలచిన వారు పూర్తి సమాచారం కోసం ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ https://www.idbibank.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ మొత్తం ఖాళీలు

  • 500

అర్హతలు:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 31.01.2024 నాటికి 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు వయోసడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థుల‌కు శిక్షణ కాలం (6 నెల‌లు)లో నెల‌కు రూ.5000 అందిస్తారు. ఇంట‌ర్న్‌షిప్ (2 నెల‌లు) స‌మ‌యంలో నెల‌కు రూ.15 వేలు చెల్లిస్తారు. శిక్షణానంతరం ఉద్యోగంలో చేరిన‌వారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వ‌ర‌కు వార్షిక వేతనం అందుతుంది.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 200 చెల్లించాలి. మిగతావారు రూ. 1000 దరఖాస్తు రుసుం చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం:

  • 12-02-2024

దరఖాస్తులకు తుది గడువు:

  • 26-02-2024

ఆన్‌లైన్ పరీక్ష తేదీ:

  • 17-03-2024.

ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్: