iDreamPost
android-app
ios-app

డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ Jobs.. నెలకు 81 వేల జీతం

ITBP Recruitment 2024: నిరుద్యోగులకు అలర్ట్. డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరికొన్ని రోజుల్లో దరఖాస్తు ప్రక్రియముగియనున్నది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 81 వేల వరకు జీతం అందుకోవచ్చు.

ITBP Recruitment 2024: నిరుద్యోగులకు అలర్ట్. డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరికొన్ని రోజుల్లో దరఖాస్తు ప్రక్రియముగియనున్నది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 81 వేల వరకు జీతం అందుకోవచ్చు.

డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ Jobs.. నెలకు 81 వేల జీతం

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. మంచి వేతనాలతో కూడిన జాబ్స్ ను పొంది లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 81 వేల జీతం పొందొచ్చు. మరో ఐదు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సి (నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 112 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 112

  • హెడ్ ​​కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్)

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(సైకాలజీ) లేదా తత్సమానం లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా తత్సమానం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 05.08.2024 నాటికి 20 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.25,500 – రూ.81,100 అందిస్తారు.

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 07-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 05-08-2024