P Venkatesh
India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖ 44228 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా నాలుగు రోజులే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.
India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖ 44228 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా నాలుగు రోజులే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
మీరు పదోతరగతి ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? టెన్త్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. టెన్త్ క్వాలిఫికేషన్ తో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ విసిగిపోయిన వారు ఈ గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. మంచి వేతనంతో కూడిన ఈ జబ్స్ ను సాధిస్తే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. ఇటీవల భారతీయ తపాలా శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా 44228 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఈ జాబ్స్ కు దరఖాస్తు ప్రక్రియ ఇంకో నాలుగు రోజుల్లో ముగియనున్నది. ఇప్పుడే అప్లై చేసుకోండి.
పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి తరచుగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 44228 పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారు జీడీఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం)గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. స్థానిక భాషపై పట్టు ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 05 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.