P Venkatesh
మీరు టెన్త్ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 2140 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

డిపార్ట్ మెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇటీవల రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ 2250 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారీ స్థాయిలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 2140 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. టెన్త్ పాసైతే చాలు మీరు ఈ ఉద్యోగాలను సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడిపోవచ్చు.
భారత కేంద్ర హోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉండే సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ జారీ అయిన నెల రోజుల్లోపు దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం బీఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా rectt.bsf.gov.in ను పరిశీలించాల్సి ఉంటుంది.