iDreamPost
android-app
ios-app

డిగ్రీతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. నెలకు 89 వేల జీతం.. ఇప్పుడే అప్లై చేసుకోండి

NABARD Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 89 వేల జీతం అందుకోవచ్చు.

NABARD Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 89 వేల జీతం అందుకోవచ్చు.

డిగ్రీతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. నెలకు 89 వేల జీతం.. ఇప్పుడే అప్లై చేసుకోండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు డిగ్రీ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 89 వేల వరకు జీతం పొందొచ్చు. తాజాగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నాబార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 15 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరి ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకో మెట్రిక్ టెస్ట్, ఇంటర్య్వూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 102

అర్హత:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరి ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకో మెట్రిక్ టెస్ట్, ఇంటర్య్వూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 44500- రూ. 89150 అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.150, ఇతరులకు రూ.850 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 27-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 15-08-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి