iDreamPost
android-app
ios-app

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి

  • Published Apr 25, 2024 | 9:37 PM Updated Updated Apr 25, 2024 | 9:37 PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి సమయం. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి సమయం. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

  • Published Apr 25, 2024 | 9:37 PMUpdated Apr 25, 2024 | 9:37 PM
డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి

ప్రైవేట్ ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కు మంచి జీతంతో పాటు బోలెడన్నీ సదుపాయాలను కల్పిస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ కారణంగా యువత ప్రభుత్వ కొలువులను సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? మీరు డిగ్రీ పాసైనట్లైతే మీకు ఇదే మంచి అవకాశం. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో ఖాళీగా ఉన్న 506 అసిస్టెంట్ కమాండెంట్‌ (గ్రూప్ -ఏ) ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పాసైన పురుష, మహిళా అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • యూపీఎస్సీ సీఏపీఎఫ్‌ 2024 మొత్తం ఖాళీలు: 506
  • బీఎస్‌ఎఫ్‌- 186
  • సీఆర్‌పీఎఫ్‌- 120
  • సీఐఎస్‌ఎఫ్‌- 100
  • ఐటీబీపీ- 58
  • ఎస్‌ఎస్‌బీ- 42

అర్హత:

  • అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 14-05-2024

రాత పరీక్ష తేదీ:

  • 04-08-2024

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet