iDreamPost
android-app
ios-app

ఆర్మీలో చేరడం మీ కలా?.. అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.. డిగ్రీ పాసైతే చాలు

Army NCC Special Entry Scheme 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్మీలో చేరాలనే మీ కోరికను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఇండియన్ ఆర్మీలో ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

Army NCC Special Entry Scheme 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్మీలో చేరాలనే మీ కోరికను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఇండియన్ ఆర్మీలో ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ఆర్మీలో చేరడం మీ కలా?.. అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.. డిగ్రీ పాసైతే చాలు

జవాన్లకు సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది. దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించే ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు మంచి జీతంతో లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. భారత ఆర్మీలో చేరడం మీ కలా? ఆర్మీలో చేరడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోండి. మీరు డిగ్రీ పాసైతే చాలు ఇండియన్ ఆర్మీలో జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఇండియన్ ఆర్మీలో ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? పూర్తి వివరాలు మీకోసం..

ఇండియన్ ఆర్మీలో ‘ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్’ 57వ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2025 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 9 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (57వ కోర్సు)

మొత్తం ఖాళీలు: 76

విభాగాల వారీగా ఖాళీలు:

ఎన్‌సీసీ (మెన్): 70 పోస్టులు

ఎన్‌సీసీ (ఉమెన్): 06 పోస్టులు

అర్హతలు:

  • కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఎన్‌సీసీ‌ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 01.01.2025 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అప్లికేషన్ షార్ట్ లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్య్వూ, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ:

  • ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ ఇస్తారు.

స్టైపెండ్:

  • నెలకు రూ.56,100 చెల్లిస్తారు. పే స్కేల్ ప్రకారం అలవెన్సులు అన్నీ కలుపుకుని 2 లక్షల వరకు అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 11-07-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 09-08-2024