10th పాసైతే చాలు.. రైల్వేలో 1,010 జాబ్స్ మీవే.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. పదోతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలను సాధించే అవకాశం వచ్చింది. ఇప్పుడే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. పదోతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలను సాధించే అవకాశం వచ్చింది. ఇప్పుడే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. మీరు పదోతరగతి ఉత్తీర్ణులైతే చాలు ఇండియన్ రైల్వేలో జాబ్ పొందొచ్చు. మంచి వేతనం అందుకోవచ్చు. టెన్త్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇటీవల చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేష్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1,010 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు ట్రేడును అనుసరించి కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఇంటర్ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. అభ్యర్థులు 15 నుంచి 24 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూన్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 1,010.

ట్రేడులు:

  • కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్‌‌టీ పాథాలజీ, పీఏఎస్‌ఏఏ.

ఫ్రెషర్స్: 330

  • కార్పెంటర్- 50
  • ఎలక్ట్రీషియన్- 160
  • ఫిట్టర్- 180
  • మెషినిస్ట్- 50
  • పెయింటర్- 50
  • వెల్డర్- 180
  • ఎంఎల్‌టీ రేడియాలజీ- 05
  • ఎంఎల్‌టీ పాథాలజీ- 05

ఎక్స్-ఐటీఐ: 680

  • కార్పెంటర్- 40
  • ఎలక్ట్రీషియన్- 40
  • ఫిట్టర్- 80
  • మెషినిస్ట్- 40
  • పెయింటర్- 40
  • వెల్డర్- 80
  • పీఏఎస్‌ఏఏ- 10

అర్హత:

  • కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఐటీఐ, 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 21.06.2024 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అకడమిక్ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైపెండ్:

  • నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు అందుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 21-06-2024
Show comments