iDreamPost
android-app
ios-app

టెన్త్, ఇంటర్ అర్హతతో.. రైల్వేలో 2,860 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

మీరు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు భారీ శుభవార్త. సదరన్ రైల్వే 2,860 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు భారీ శుభవార్త. సదరన్ రైల్వే 2,860 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

టెన్త్, ఇంటర్ అర్హతతో.. రైల్వేలో 2,860 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మీరు రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు ఇదే మంచి అవకాశం. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు ఈ నోటిఫికేషన్ ను అస్సలు వదలకండి. ఇటీవల సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. సదరన్ రైల్వే పరిధిలోని పలు డివిజన్లలోని పలు ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

చెన్నై డివిజన్‌, పాలక్కడ్‌ డివిజన్‌, తిరువనంతపురం డివిజన్‌, సాలెమ్‌ డివిజన్‌, మధురై డివిజన్‌, తిరుచిరాపల్లి డివిజన్‌, కోయంబత్తూర్‌, పెరంబూర్‌ తదితర యూనిట్స్ లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 28వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సదరన్ రైల్వే అధికారికి వెబ్ సైట్ https://sr.indianrailways.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు వయోపరిమితి ఎంత? ఎంపిక విధానం? దరఖాస్తు ఫీజు ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2,860 Jobs in Railways

ముఖ్యమైన సమాచారం :

మొత్తం అప్రెంటీస్‌ ఖాళీలు:

  • 2,860

ట్రేడులు:

  • ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), ఎంఎల్‌టీ(రేడియాలజీ), ఎంఎల్‌టీ(పాథాలజీ), ఎంఎల్‌టీ(కార్డియాలజీ), టర్నర్‌, సీఓపీఏ, ప్లంబర్‌, పీఏఎస్‌ఏఏ, మెకానిక్- మెషిన్ టూల్ మెయింటనెన్స్, ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, మెకానికల్, అడ్వాన్స్‌డ్‌ వెల్డర్‌, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్- రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ తదితర ట్రేడుల్లో పోస్టులున్నాయి.

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి  15 ఏళ్లు కలిగి ఉండాలి. అదే విధంగా 22 ఏళ్ల వయసు మించకుండా ఉండాలి. కేటగిరీల వారీగా వయో సడలింపులు వర్తిస్తాయి.

ట్రైనింగ్‌ పీరియడ్‌:

  • ఫిట్టర్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నిషియన్స్‌ ట్రేడులకు 15 నెలల నుంచి 2 సంవత్సరాలు, ఇతర ట్రేడులకు 1 సంవత్సరం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన పని లేదు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం:

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.9,000. నుంచి రూ.12,000 చెల్లిస్తారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ:

  • 29-01-2024

అప్లికేషన్ చివరితేదీ:

  • 28-02-2024

సదరన్ ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి