P Venkatesh
మీరు టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులయ్యారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 1646 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
మీరు టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులయ్యారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 1646 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
P Venkatesh
భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటి. దేశంలో రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందింది ఇండియన్ రైల్వేస్. కాగా రైల్వే సేవల్లో ఏమాత్రం అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు రైల్వే శాఖ భర్తీ చేస్తూ ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జైపూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
మీరు టెన్త్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1646 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ను https://rrcjaipur.in/ పరిశీలించాల్సి ఉంటుంది.
1646