iDreamPost
android-app
ios-app

లక్కీ ఛాన్స్.. డిగ్రీ పాసయ్యారా? ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి మంచి అవకాశం. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి మంచి అవకాశం. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

లక్కీ ఛాన్స్.. డిగ్రీ పాసయ్యారా? ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి

ఈ రోజుల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగం పొందాలంటే కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. డిగ్రీతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను పొందే ఛాన్స్ ఉంటుంది. దేశంలో ప్రతి ఏడు వేలాది మంది డిగ్రీ పట్టాలు పుచ్చుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా మారింది. అయితే పోటీ ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో చదివితే జాబ్ పొందడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరు కూడా డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతో జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకు అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రీలీజ్ చేసింది. మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌ పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు మే 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 276

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 01.01.2024 నాటికి 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ వ్యవధి:

  • ఏడాది.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ కేటగిరీల వారు రూ.700 చెల్లించాలి. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ఎంపిక విధానం:

  • ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 28-05-2024.