డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? PhonePeలో జాబ్ కొట్టే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ పాసైతే చాలు.

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ పాసైతే చాలు.

ప్రస్తుతం అందరు ఆన్ లైన్ పేమెంట్స్ కు అలవాటు పడిపోయారు. పల్లె నుంచి పట్టణాల వరకు చెల్లింపులన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పేలకు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. అయితే ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ కు మాత్రమే కాదు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తోంది. ఫోన్ పే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఫోన్ పేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఫోన్‌పే కంపెనీ.. అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం (క్యూ-కామర్స్), ఇండస్ట్రీస్‌ (చాట్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్), కస్టమర్ ఫేసింగ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ ఉండాలి. అయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్‌ లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఈఎస్ఐసీలో ఉద్యోగాలు:

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కార్మికులకు ఆయా సంస్థలు ఈఎస్ఐసీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఈఎస్ఐసీలో మెరుగైన సేలను అందించేందుకు అవసరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిచుకుంటుంది సంస్థ. ఇటీవల పూణె బిబ్వేవాడిలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పిటల్(ఈఎస్ఐసీ) సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా తత్సమానం/ పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

Show comments