P Venkatesh
ఇండియన్ నేవీ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. లక్షకు పైగా వేతనం పొందొచ్చు.
ఇండియన్ నేవీ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. లక్షకు పైగా వేతనం పొందొచ్చు.
P Venkatesh
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేవీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను చేపట్టింది. ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నేవీ జాబ్స్ కు అప్లై చేసుకుని జాబ్ కొట్టండి. ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (INCET-01/2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 910 ఛార్జ్‌మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇండియన్ నేవీలో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వారీగా పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ డిసెంబరు 18న ప్రారంభంకానుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 31 వరకు నిర్ణయించారు. అప్లై చేసుకోబోయే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్ సైట్ https://www.joinindiannavy.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.