iDreamPost

ITలో తగ్గిపోతున్న ఉద్యోగుల సంఖ్య! గాల్లో దీపాలుగా సాఫ్ట్ వేర్ జాబ్స్!

ఐటీ ఉద్యోగులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. ఉద్యోగులను తొలగిస్తూ షాకిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పరిస్థితి గాల్లో దీపాల మాదిరిగా అయిపోయింది.

ఐటీ ఉద్యోగులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. ఉద్యోగులను తొలగిస్తూ షాకిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పరిస్థితి గాల్లో దీపాల మాదిరిగా అయిపోయింది.

ITలో తగ్గిపోతున్న ఉద్యోగుల సంఖ్య! గాల్లో దీపాలుగా సాఫ్ట్ వేర్ జాబ్స్!

ఐటీ రంగంలో ఉద్యోగాల పట్ల యువత తెగ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. లక్షల్లో జీతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, వారానికి రెండు రోజులు సెలవులు ఇంక ఇతర సదుపాయాలు ఉండడంతో ఐటీ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఉద్యోగం చేయాలంటే ఐటీ రంగమే అనేంతలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇదంతా ఒకప్పటి ముచ్చట. నేడు ఐటీ రంగంలోని పరిస్థితులు తలకిందులయ్యాయి. ఐటీలో ఉద్యోగాలు చేసే వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందో తెలియక వణికిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటు వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

సాఫ్ట్ వేర్ రంగానికి గ్రహణం పట్టుకుంది. ఎప్పుడు లేని విధంగా దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న ఆర్థిక అనిశ్చితి, ఆర్థికమాంద్యం భయాలు వంటి కారణాలతో ఐటీ కంపెనీలు లేఆఫ్స్ కు తెరలేపుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారిపోయాయి. కొత్తగా ఐటీ రంగంలోకి రావాలనుకునే వారికి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కాగా దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్‌-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది.

IT Jobs

సాధారణంగా ఐటీలో ఎప్పటికప్పుడు రిక్రూట్ మెంట్స్ జరుగుతుంటాయి. దీంతో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కొత్త నియమాకాలు చేపట్టే పరిస్థితి లేకపోగా ఉన్న ఉద్యోగులను కూడా పంపించేస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఇటీవల ఆయా ఐటీ కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69 వేల ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ప్రాజెక్ట్స్ లేకపోవడం, డిమాండ్ తగ్గిపోవడంతో ఉద్యోగుల తొలగింపుకు కారణమవుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉద్యోగులు సంఖ్యను తగ్గించిన కంపెనీలు:

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఆయా సంస్థల ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల్లో మొత్తంగా 69,167 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది. టీసీఎస్‌లో 13,249 మంది, విప్రోలో 24,516, ఇన్ఫీలో 25,994, టెక్‌ మహీంద్రాలో 6,945 మేర ఉద్యోగులు తగ్గిపోయారు. ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య 1,537 మేర పెరిగింది.

దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఉన్నఫలంగా ఉద్యోగాలు పోతే ఎలా బ్రతకాలి. కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతున్న వేళ ఫ్రెషర్ల నియామకాలకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ సుమారు 40 వేల మందిని, హెచ్‌సీఎల్‌ 10 వేల మంది, టెక్‌ మహీంద్రా 6 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. ఏది ఏమైనా కంపెనీలు చేపడుతున్న లేఆఫ్స్ తో ఐటీ ఉద్యోగులు కలవరపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి