iDreamPost
android-app
ios-app

మీలో ఈ స్పెషల్ స్కిల్ ఉందా? పరీక్షలేకుండానే Govt జాబ్ కొట్టే ఛాన్స్.. మంచి జీతం

Department of Ayush Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

Department of Ayush Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీలో ఈ స్పెషల్ స్కిల్ ఉందా? పరీక్షలేకుండానే Govt జాబ్ కొట్టే ఛాన్స్.. మంచి జీతం

ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆఖరికి అటెండర్ పోస్టు అయినా పర్లేదు గవర్నమెంట్ కొలువైతే చాలు అనుకునే వారు కోకొల్లలు. ప్రభుత్వ కొలువులకు ప్రారంభంలో శాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్స్ పీరియన్స్ పెరిగినా కొద్ది హైక్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పలు సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఉంటుంది. అంతేకాదు లైఫ్ కి సెక్యూరిటీ ఉంటుంది. మరి గవర్నమెంట్ జాబ్ కొట్టడం నేటి రోజుల్లో అంత సులువైన పనికాదనే చెప్పాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి. ఇంటర్య్వూలను ఎదుర్కోవాలి. ఇలా అన్ని దశల్లో ప్రతిభ కనబరిస్తే తప్పా గవర్నమెంట్ జాబ్ వరించదు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో పాటుగా పలు రకాల స్కిల్స్ తో కూడా జాబ్స్ కొట్టే ఛాన్స్ ఉంది. మరి మీలో ఈ స్పెషల్ స్కిల్ ఉందా? అయితే మీరు ఎలాంటి పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ వచ్చింది. ఇంతకీ ఆ స్కిల్ ఏంటి? ఎవరు అర్హులు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం?

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఇటీవల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో జాజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పార్ట్ టైమ్‌ విధానంలో వీటిని భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పురుష, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

యోగా ఇన్‌స్ట్రక్టర్లు సెషన్ల వారీగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి సెషన్ గంటసేపు ఉంటుంది. ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెలిస్తారు. యోగా ఇన్‌స్ట్రక్టర్లు (పురుష) నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాల్సి ఉంటంది. ఇక మహిళా యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు హాజరుకావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులను కేవలం విద్యా అర్హతలు, ఇంటర్వూ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు. వరంగల్ జోన్ లోఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఇంటర్వూలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24- 30 తేదీల మధ్య ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.