iDreamPost
android-app
ios-app

ITBPలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు 81 వేల జీతం.. మిస్ చేసుకోకండి

ITBP Recruitment 2024: గవర్నమెంట్ జాబ్స్ సాధించడమే మీ లక్ష్యమా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ITBP Recruitment 2024: గవర్నమెంట్ జాబ్స్ సాధించడమే మీ లక్ష్యమా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ITBPలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు 81 వేల జీతం.. మిస్ చేసుకోకండి

ఇటీవల కేంద్ర రక్షణ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. తాజాగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ .. నాన్ గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ జాబ్స్ భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 128 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఐటీబీపీలో ఉద్యోగాల కోసం పోటీపడే వారు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/డిప్లొమా కోర్సు, పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే హెడ్ కానిస్టేబుల్ కు రూ. 25,500-రూ. 81,100, కానిస్టేబుల్ కు రూ. 21700-69100 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 128

  • హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సర్స్ వెటర్నరీ): 9
  • కానిస్టేబుల్(యానిమల్ అటెండెంట్):115
  • కానిస్టేబుల్(కెన్నెల్ మన్): 4

అర్హత:

  • హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/డిప్లొమా కోర్సు, కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • హెడ్ కానిస్టేబుల్ కు రూ. 25,500-రూ. 81,100, కానిస్టేబుల్ కు రూ. 21700-69100 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 30-08-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 29-09-2024