P Venkatesh
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేసింది. పలు రీజియన్లలో ఏకంగా 9 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేసింది. పలు రీజియన్లలో ఏకంగా 9 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..
P Venkatesh
ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం భారత్. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందింది భారతీయ రైల్వే. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి రైల్వే డిపార్ట్ మెంట్ అవసరమైన సిబ్బందిని నియమించుకుంటుంది. దేశంలోని ఏదో ఒక రైల్వే రీజియన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు శుభవార్తను అందించింది. పలు రీజియన్లలో ఖాళీగా ఉన్న 9000 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
మీరు రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. దేశ వ్యాప్తంగా ఉన్న రీజియన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 9000వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు షార్ట్ నోటిఫికేషన్ ను ప్రకటించింది. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, సికింద్రాబాద్, తదితర రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైతే చాలు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో విడుదల చేయనుంది రైల్వే బోర్డు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://indianrailways.gov.in/ వెబ్‌సైట్ ను పరిశీలించవచ్చు.