iDreamPost
android-app
ios-app

రాత పరీక్ష లేకుండానే CRPFలో ఉద్యోగాలు.. నెలకు 75 వేల జీతం.. అర్హులు వీరే

CRPF Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలక ఎంపికైతే నెలకు 75 వేల జీతం అందుకోవచ్చు.

CRPF Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలక ఎంపికైతే నెలకు 75 వేల జీతం అందుకోవచ్చు.

రాత పరీక్ష లేకుండానే CRPFలో ఉద్యోగాలు.. నెలకు 75 వేల జీతం.. అర్హులు వీరే

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ పరీక్షలు రాయాలి. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభకనబర్చాలి. ఆ తర్వాత పోస్టులను అనుసరించి ఇంటర్య్వలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్ని దశలను దాటితే తప్పా ఉద్యోగం వరించదు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 75 వేల జీతం అందుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఈ జాబ్స్ కు అర్హులు ఎవరంటే?

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాంట్రాక్ట్ ప్రతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 31న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 70 ఏళ్లకు మించకూడదు. ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న మహిళా, పురుష అభ్యర్థులు పోటీపడొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 22

అర్హత:

  • అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75 వేల జీతం అందిస్తారు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 70 ఏళ్లుకు మించకూడదు.

ఇంటర్య్వూ తేదీ:

  • 31-07-2024

వేదిక:

  • హైదరాబాద్, పూణె, శ్రీనగర్, ఇంఫాల్, గుహవటి, గాంధీనగర్ లోని సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో ఉంటుంది.