iDreamPost
android-app
ios-app

APలోని జూనియర్‌ కాలేజీల్లో 459 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ లోని జూనియర్ కాలేజీల్లో 459 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

ఆంధ్రప్రదేశ్ లోని జూనియర్ కాలేజీల్లో 459 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

APలోని జూనియర్‌ కాలేజీల్లో  459 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉద్యోగార్థులకు శుభవార్తను అందిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి భర్తీ ప్రక్రియ చేపట్టింది. జగన్ సర్కార్ ఉద్యోగాల భర్తీని చేపడుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్ మెన్ల నియామకాల కోసం ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 459 కాలేజీల్లో త్వరలో నైట్‌ వాచ్‌మెన్ల భర్తీ చేపట్టనున్నారు. కాగా ఇప్పటికే 16 కాలేజీలకు నైట్‌ వాచ్‌మెన్లు ఉన్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇవిగాకనే మరో 459 నైట్ వాచ్ మెన్లను నియమించనున్నట్లు వెల్లడించింది.

కాగా జూనియర్ కాలేజీల్లో నియమించే నైట్ వాచ్ మెన్లకు నెలకు రూ.6000 గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డ్ పేర్కొంది. అయితే ఈ పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆయాలుగా పనిచేస్తున్న మహిళల భర్తలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. గ్రామం లేదా వార్డుల్లో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్లకు రెండవ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేని పక్షంలో నిబంధనల మేరకు కాలేజ్ డెవలప్ మెంట్ కమిటీ అర్హత గల వ్యక్తిని నియమించుకునే అవకాశం కల్పించింది.

కాలేజీల్లోని ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ఫర్నీచర్‌, కంప్యూటర్లు, ఇతర విలువైన పరికరాలు దొంగతనానికి గురికాకుండా నైట్ వాచ్ మెన్స్ రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఈ వస్తువులు అన్నింటిని రక్షించడంతో పాటు సంఘ వ్యతిరేక శక్తులు కాలేజీ ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి నైట్ వాచ్ మెన్ల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. నైట్ వాచ్ మెన్ల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలకు https://bieap.apcfss.in/ వెబ్‌సైట్‌ ను పరిశీలించొచ్చు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకునేందుకు ఈ లింక్ https://bieap.apcfss.in/ పై క్లిక్ చేయండి.