iDreamPost
android-app
ios-app

రైల్వేలో 4,096 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు

RRC NR Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏకంగా 4096 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పుడే అప్లై చేసుకోండి.

RRC NR Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏకంగా 4096 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పుడే అప్లై చేసుకోండి.

రైల్వేలో 4,096 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు

అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులను కలిగి ఉన్న శాఖ భారతీయ రైల్వే. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు.. సురక్షితమైన ప్రయాణాల కోసం ఎప్పటికప్పుడు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటుంది. నిత్యం ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. రైల్వేలో జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నార్త్ రైల్వే భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. ఏకంగా 4096 జాబ్స్ భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఎంపిక ఎలా చేస్తారు? ఆ వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్ షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 4,096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. 15 నుంచి 24 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు:

  • 4,096

అర్హత:

  • టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసై ఉండాలి.

వయో పరిమితి:

  • 16.09.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 16-09-2024