iDreamPost
android-app
ios-app

రెడీగా ఉండండి.. విద్యుత్‌ సంస్థల్లో 3000 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్

Telangana Power Sector: ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలో విద్యుత్ సంస్థల్లో 3 వేల జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. రెడీగా ఉండండి.

Telangana Power Sector: ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలో విద్యుత్ సంస్థల్లో 3 వేల జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. రెడీగా ఉండండి.

రెడీగా ఉండండి.. విద్యుత్‌ సంస్థల్లో 3000 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగనున్నది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ తో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందబోతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇటీవల విడుదల చేసిన తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబరులో విద్యుత్‌ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత విభాగాల నుంచి ఖాళీలను పంపించాలని విద్యుత్‌ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్‌ సంస్థల్లో కలిపి మొత్తం 3 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటి భర్తీకి సంబంధించి అక్టోబర్‌ నెలలో నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. డిస్కంలలో కిందిస్థాయిలో అసిస్టెంటు లైన్‌మెన్, జూనియర్‌ లైన్‌మెన్, సబ్‌ ఇంజినీర్లు, సహాయ ఇంజినీరుతోపాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ట్రాన్స్‌కో, జెన్‌కోలలో అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. కాబట్టి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆశావాహులు రెడీగా ఉండండి.

విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల కొరతతో సమస్యలు ఏర్పడుతున్నాయి. టెక్నికల్ సమస్యలు, వర్షాలు కురిసనప్పుడు తలెత్తిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సరిపడా విద్యుత్ సిబ్బంది లేక విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక్కో క్యాడర్‌ వారీగా ఖాళీల వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు, ట్రాన్స్‌కోలలో పెద్దఎత్తున పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పదోన్నతులతో కిందిస్థాయిలో 3 వేలకు పైగా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తేలింది. వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.