P Venkatesh
మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా. అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. కరెన్సీ నోట్ ప్రెస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా. అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. కరెన్సీ నోట్ ప్రెస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
P Venkatesh
మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా. అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. కరెన్సీ నోట్ ప్రెస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఏకంగా నెలకు రూ. 95 వేల కంటే ఎక్కువ జీతాన్ని అందుకోవచ్చు. ఇంతకీ ఇది ఏ రాష్ట్రానికి చెందిన కరెన్సీ నోట్ ప్రెస్? ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు? అర్హతలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న మినీరత్న కేటగిరీకి చెందిన కరెన్సీ నోట్ ప్రెస్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నోట్ ప్రెస్ యొక్క అధికారిక వెబ్‌సైట్ cnpnashik.spmcil.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 18 వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
మొత్తం పోస్టులు 117. వాటిల్లో సూపర్‌వైజర్ – 3 పోస్టులు, కళాకారుడు – 1 పోస్ట్, సెక్రటేరియట్ అసిస్టెంట్- 1 పోస్ట్, జూనియర్ టెక్నీషియన్ – 112 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత
బీఎస్సీ ఇంజనీరింగ్ సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.
వయోపరిమితి
అభ్యర్థుల వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మరియు షరతుల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలనే నిబంధన ఉంది.
జీత భత్యాలు
సూపర్‌వైజర్- రూ.27,600-95,910
కళాకారుడు – రూ.23,910–85,570
సెక్రటేరియట్ అసిస్టెంట్- రూ.23,910–85,570
జూనియర్ టెక్నీషియన్ – రూ.18,780-67,390
ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ వ్రాత పరీక్ష ద్వారా రిక్రూట్‌మెంట్ కింద అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము
జనరల్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 600 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ
19-10-2023
దరఖాస్తుకు చివరి తేదీ
18.11.2023
ఆన్‌లైన్ పరీక్ష
జనవరి/ఫిబ్రవరి 2024