iDreamPost
android-app
ios-app

ట్యూషన్స్ చెబుతూ పేదింటి బిడ్డ సాధించిన విజయం! అందరికీ ఆదర్శం!

  • Published Aug 09, 2024 | 11:31 AM Updated Updated Aug 09, 2024 | 11:46 AM

Mounika got 4 Government jobs: పేదింటి బిడ్డ ప్రతిభకు ఫలితం దక్కింది. ట్యూషన్స్ చెబుతూనే పోటీపరీక్షలకు సన్నద్ధమై ఒకటి కాదు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది.

Mounika got 4 Government jobs: పేదింటి బిడ్డ ప్రతిభకు ఫలితం దక్కింది. ట్యూషన్స్ చెబుతూనే పోటీపరీక్షలకు సన్నద్ధమై ఒకటి కాదు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది.

ట్యూషన్స్ చెబుతూ పేదింటి బిడ్డ సాధించిన విజయం! అందరికీ ఆదర్శం!

సంకల్పబలముంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నారు నేటి యువత. కన్న వారు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, కలల్ని నిజం చేస్తున్నారు. ముందు నుంచే ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. చదువు పూర్తవకుండానే లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ క్రమంలో మరో పేదింటి బిడ్డ ప్రతిభకు సరైన ఫలితం దక్కింది. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ కు ఫుల్ కాంపిటీషన్ ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఆ యువతి. ఆమె మరెవరో కాదు సూర్యాపేట జిల్లాకు చెందిన భూక్య మౌనిక.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతడోనబండ తండాకు చెందిన భూక్య మౌనిక 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ.. స్థానిక పిల్లలకు ట్యూషన్‌లు చెప్పుకూంటూ సొంతంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమైంది. ట్యూషన్స్ చెబుతూనే ఆమె తన తలరాతను మార్చుకుంది. పేదింటిలో పుట్టినా.. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ దాటుకుని పట్టుదలతో కష్టపడి చదవి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది మౌనిక. కష్టపడితేనే ఫలితం వరిస్తుందని నిరూపించింది మౌనిక. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 జాబ్స్ కు ఎలాంటి కోచింగ్ లేకుండానే 6వ ర్యాంక్, టీజీపీఎస్సీ ఫలితాల్లో పంచాయతీరాజ్ ఏఈఈ, 2023లో రైల్వేలో క్యారేజ్ మరియు వ్యాగన్, లెవెల్-3లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు సాధించింది.

ట్యూషన్స్ చెబుతూ పేదింటి బిడ్డ 4 ఉద్యోగాలు సాధించడం పట్ల ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వేలు, లక్షలు వెచ్చించి కోచింగ్స్ తీసుకుంటున్నా ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఏ కోచింగ్ లేకున్నా కూడా 4 గవర్నమెంట్ జాబ్స్ సాధించడం హర్షనీయం. మౌనికను ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను చేదించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటున్నారు. మౌనిక సాధించిన విజయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.