Jobs: 10th అర్హతతో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాలు.. నెలకు 56 వేల జీతం..

Income Tax: ఆదాయపు పన్ను శాఖ తాజాగా పోస్టులను విడుదల చేసింది. గ్రూప్ సి కేటగిరీ కింద ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ని రిలీజ్ చేసింది.

Income Tax: ఆదాయపు పన్ను శాఖ తాజాగా పోస్టులను విడుదల చేసింది. గ్రూప్ సి కేటగిరీ కింద ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ని రిలీజ్ చేసింది.

ప్రభుత్వ ఉదోగాల కోసం ప్రయత్నిస్తున్నారా ? అయితే మీకో గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను శాఖ నిరుద్యోగులకు సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. తాజాగా కొత్త పోస్టులను విడుదల చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రస్తుతం గ్రూప్ సి కేటగిరీ కింద ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ని రిలీజ్ చేసింది. అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలను కల్పించడం ఈ రిక్రూట్‌మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? వీటికి అప్లై చేసుకోవడానికి విద్యార్హత ఏంటి? జీతం ఇంకా వీటికి ఎలా అప్లై చేసుకోవాలి? వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇందులో మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. UR కేటగిరీకి 13 పోస్టులు, OBC 6, EWS 2, SC 3, ST 1 పోస్టులు ఉన్నాయి. అటెండెంట్ పోస్టుకు విద్యార్హత విషయానికి వస్తే.. వీటికి అప్లై చేసుకునే అభ్యర్ధులు కచ్చితంగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీటికి అప్లై చేసుకునే అబ్యార్దుల వయస్సు కచ్చితంగా 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఈ ఉద్యోగానికి నెలకు రూ.18,000 నుండి రూ.56,900 వరకు జీతం పొందుతారు. ఆసక్తి గల అభ్యర్ధులు 22 సెప్టెంబర్ 2024 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ www.incometax.gov.in.ని సందర్శించాలి. ఈ పోస్టులకు ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. అభ్యర్థులకు 6 అక్టోబర్ 2024న రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ గ్రామర్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, కామన్ సెన్స్, జీకే మీద ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో రాణించాలంటే ఈ టాపిక్స్ మీద గట్టి పట్టు ఉండాలి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ లని అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 మధ్యలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్ధులు ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments