ISRO Jobs: ఇస్రోలో జాబ్ చేయడం మీ కల? ఐతే మీ కోసమే ఈ సువర్ణావకాశం.. 95 వేల జీతం!

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజెషన్ (ISRO ) లో ఉద్యోగాలు సంపాదించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు, అయితే ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారందరికి ఓ గుడ్ న్యూస్. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని పోస్ట్ లను విడుదల చేశారు.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజెషన్ (ISRO ) లో ఉద్యోగాలు సంపాదించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు, అయితే ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారందరికి ఓ గుడ్ న్యూస్. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని పోస్ట్ లను విడుదల చేశారు.

ఉద్యోగం తెచ్చుకోవడం అనేది ఎంతో మంది కల. దానికోసం పగలు రాత్రి తేడా లేకుండా చాలా మంది చదువుతూ ఉంటారు. అందులోను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజెషన్ (ISRO ) లో ఉద్యోగాలు సంపాదించాలని చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి వారందరికి ఓ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజెషన్ లోని.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ , రెసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్స్ కోసం కాంట్రాక్టు పద్దతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మరి దానికోసం ఎలా అప్లై చేసుకోవాలి. ఎవరు అర్హులు అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రాజెక్ట్ అసోసియేట్ , కోసం అప్లై చేసుకోవాలి అనుకునే వారు.. వారి వారి డిగ్రీలలో కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.8 4 10 స్కేల్ తో విద్యార్హతను కలిగి ఉండాలి. లేదా వాతావరణ శాస్త్రంలో Msc డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఇక రిసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్స్ కోసం అప్లై చేసుకోదలచిన వారు.. వారి వారి డిగ్రీలలో కనీసం 65 శాతం మార్కులతో లేదా ఫీజిక్స్ , మెటీరియోలజిలో Msc డిగ్రీ ని కలిగి ఉండాలి. ఇక ఈ పోస్ట్స్ కోసం రిజిస్ట్రేషన్ గడువు మే 5, 2024. ఈ అర్హతలు కలిగి ఉన్న వారందరికీ ముందుగా వ్రాత పరీక్షలు ఉంటాయి. అవి కేవలం తిరువనంతపురంలో మాత్రమే జరుగుతాయి.

ప్రాజెక్ట్ అసోసియేట్ కోసం అప్లై చేసుకోవాలి అనుకునే వారికి వయో పరిమితి 28 ఏళ్ళు , అలాగే రిసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్స్ కోసం అప్లై చేసుకోదలచిన వారికీ వయో పరిమితి 35 ఏళ్లుగా పరిగణించారు. అలాగే వారి వేతనాల విషయానికొస్తే .. రిసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్స్ కు ప్రాజెక్ట్ అసోసియేట్స్ కు జీతం రూ.95,000 ఉంటుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ISRO అధికారిక వెబ్ సైట్ లో ఈ పోస్ట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ లకు 2 పోస్ట్స్ , ప్రాజెక్ట్ అసోసియేట్ కు 01 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి.

Show comments