దిగ్గజ టెక్ కంపెనీ ఇంటెల్ లో ఉద్యోగాల కోత.. తొలగింపునకు రంగం సిద్ధం!

Intel: ఐటీ ఉద్యోగులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. ఉద్యోగులను తొలగిస్తూ షాకిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఐటీ జాబ్స్ పరిస్థితి గాల్లో దీపాల మాదిరిగా అయిపోయింది. తాజాగా మరో దిగ్గజ కంపెనీ భారీగా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైంది.

Intel: ఐటీ ఉద్యోగులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. ఉద్యోగులను తొలగిస్తూ షాకిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఐటీ జాబ్స్ పరిస్థితి గాల్లో దీపాల మాదిరిగా అయిపోయింది. తాజాగా మరో దిగ్గజ కంపెనీ భారీగా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైంది.

నేటికాలంలో సమాజంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా ప్రత్యేకంగా చూస్తారు. అంతేకాక ఎక్కువ మంది ఐటీ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగం వస్తే..లైఫ్ సెటిల్ అయ్యిందనే భావనలో చాలా మంది యువత, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే కొంతకాలం నుంచి ఐటీ కంపెనీలు వారి ఉద్యోగులకు షాకులు ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటు వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా..ఆ దిశగానే మరో దిగ్గజ టెక్ కంపెనీ రంగం సిద్ధం చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం ఐటీ రంగంలోని పరిస్థితులు తలకిందులయ్యాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందో తెలియక వణికిపోతున్నారు. ఒక కంపెనీని చూసి కంపెనీ.. ఇలా పోటాపోటీగా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 380 ఐటీ కంపెనీలు.. ఒక లక్షా 9 వేల 297 మందిని తొలగించాయి.  వీళ్లే కాకుండా కాంట్రాక్ట్, ఏజెన్సీల కింద పని చేసే మరో లక్ష మంది ఐటీ ఉద్యోగులు కూడా తమ జాబులు కోల్పోయారు. ఇప్పటికే చాలా దిగ్గడ కంపెనీలు లే ఆఫ్ ను ప్రకటిస్తుండగా.. తాజాగా చిప్ తయారీ సంస్థ ఇంటెల్  కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ వారంలోనే వేలాది మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్​బర్గ్ నివేదించింది.

బ్లూమ్ బర్గ్  నివేదిక ప్రకారం..ఇంటెల్ సంస్థలో 2022లో 1,31,900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.  అయితే మార్కెట్ లో వచ్చిన ఒడిదుడుకుల దృష్ట్యా గతేడాదిలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 1,24,800కి తగ్గించింది. అంతేకాక లే ఆఫ్ సవంత్సరం గా పిలవబడే 2024 ప్రారంభంలో మార్కెట్ అనిశ్చితి కారణంగా మరలా జాబ్స్  లో కోత పెట్టింది. ప్రస్తుతం ఇంటెల్ సంస్థలో 1,10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే మరోసారి తమ సంస్థలోని ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు ఇంటెల్ సిద్ధమైంది. మరోసారి కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

ఇంటెల్ కంపెనీ క్షీణిస్తున్న మార్కెట్ వాటాను తిరిగి పెంచుకోవాడనికి, అలానే ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వ్యక్తిగత కంప్యూటర్, సర్వర్, చిప్ మార్కెట్‌లలో ఆధిపత్యానికి ఇంటెల్ పేరుగాంచింది. అయితే ఏఐ అప్లికేషన్‌లలో ఉపయోగించే చిప్‌ల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. లేటెస్ట్​ అప్డేట్స్​పై ఇంటెల్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని తెలుస్తోంది.

Show comments