iDreamPost
android-app
ios-app

ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్.. వారందరికీ ఉద్యోగాలు.. లిస్ట్‌లో మీ పేరుందేమో చెక్ చేసుకోండి!

Infosys Offer Letters: దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వారందరికీ తీపికబురును అందించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

Infosys Offer Letters: దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వారందరికీ తీపికబురును అందించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్.. వారందరికీ ఉద్యోగాలు.. లిస్ట్‌లో మీ పేరుందేమో చెక్ చేసుకోండి!

వరల్డ్ వైడ్ గా టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ బెడద ఇంకా తొలిగిపోలేదు. దిగ్గజ కంపెనీలన్నీ ఉన్నపలంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. సాఫ్ట్ వేర్ జాబ్స్ గాల్లో దీపాలమాదిరిగా తయారయ్యాయి. ఎప్పుడు జాబ్ ఊడుతుందో తెలియక క్షణం క్షణం టెన్షన్ తో సతమతమవుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కొత్త నియామకాలను కూడా చేపట్టడం లేదు. దీంతో ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఫ్రెషర్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వారికి గుడ్ న్యూస్ అందించింది. వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ఐటీ సంస్థలు గతంలో చేపట్టిన రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఉద్యోగులను కూడా ఆఫీసులకు పిలవ కుండా జాప్యం చేసినట్లు సమాచారం. ఇక దీనిపై నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్.. కేంద్ర కార్మిక శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఉద్యోగులకు అన్యాయం చేయొద్దని.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు ఇస్తామని ఐటీ కంపెనీలు కీలక ప్రకటనలు చేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ మరో కీలక ప్రకటన చేసింది. రెండు సంవత్సరాల కిందట.. కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసిన ఇంజినీరింగ్ పట్టభద్రులకు నియామకాలు ఇవ్వడం తాజాగా ప్రారంభించింది.

ఇప్పటికే చాలా మంది ఫ్రెషర్లకు జాయినింగ్ డేట్స్, ఆఫర్‌కు సంబంధించిన సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైన దాదాపు 1000 మందికి ఇప్పటికే ఆఫర్ లెటర్స్ కంపెనీ అందించిందని నైట్స్ తెలిపింది. ఇక ఈ నియామకాలు సెప్టెంబర్ ఆఖర్లో లేదా అక్టోబరులో ఉంటాయని తెలుస్తోంది. మరి మీరు గతంలో ఇన్ఫోసిస్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్య్వూలో ఆఫర్ లెటర్ పొంది ఉన్నట్లైతే లిస్ట్ లో మీ పేరుందేమో చెక్ చేసుకోండి. ఇదిలా ఉంటే ఐటీ కంపెనీల్లో లేఫ్స్ కొనసాగుతుండడంతో ఫ్రెషర్లు ఐటీ జాబ్స్ కోసం కాకుండా ఇతర రంగాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు.