iDreamPost
android-app
ios-app

ఐడీబీఐలో 2,100 ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తాజాగా 2100 పోస్టులకు నోటిఫికేషన్ ను జారీ చేశారు. దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమవగా.. డిసెంబర్ 06న ముగియనున్నది. పూర్తి వివరాలు మీకోసం..

ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తాజాగా 2100 పోస్టులకు నోటిఫికేషన్ ను జారీ చేశారు. దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమవగా.. డిసెంబర్ 06న ముగియనున్నది. పూర్తి వివరాలు మీకోసం..

ఐడీబీఐలో 2,100 ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

బ్యాంకిగ్ సెక్టార్ లో ఉద్యోగాల భర్తీ కోసం తరచుగా నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుంటాయి. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పుడు మరో బ్యాంక్ ఐడీబీఐ ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. ఏకంగా 2100 జాబ్స్ ను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇదొక మంచి సువర్ణావకాశం. మరి ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? వయసు నిబంధనలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని కోరింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ పరీక్షలను ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు డిసెంబర్‌ 30న, జేఏఎం పోస్టులకు డిసెంబర్‌ 31న నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ https://www.idbibank.in/ ను సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు

  • 2100
  • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్- 800
  • ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్- 1300

అర్హత

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

  • 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం

  • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ.6.14 – రూ.6.50 లక్షలు.. ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000 జీతం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

  • జనరల్ అభ్యర్థులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

  • ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ విధానం 

  • ఆన్‌లైన్‌

దరఖాస్తు ప్రారంభం

  • 22-11-2023

దరఖాస్తులకు చివరి తేదీ

  • 06-12-2023

అధికారిక వెబ్ సైట్ వెబ్‌సైట్‌

https://www.idbibank.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి