iDreamPost
android-app
ios-app

బీటెక్ చేశారా? HP కంపెనీలో జాబ్స్.. లక్షా 60 వేల జీతం! అనుభవం అక్కర్లేదు!

  • Published Jun 06, 2024 | 8:01 PM Updated Updated Jun 06, 2024 | 8:01 PM

Jobs In HPCL: డిగ్రీ, ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, పీహెచ్డీ చేసిన వారికి సువర్ణావకాశం. హెచ్పీసీఎల్ కంపెనీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, పీహెచ్డీ చేసిన వారికి సువర్ణావకాశం. హెచ్పీసీఎల్ కంపెనీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ చేసిన వారికి అనుభవం లేకుండా ఉద్యోగాలను అందిస్తుంది. నెలకు 50 వేల నుంచి లక్ష 60 వేల జీతం అందిస్తుంది.

Jobs In HPCL: డిగ్రీ, ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, పీహెచ్డీ చేసిన వారికి సువర్ణావకాశం. హెచ్పీసీఎల్ కంపెనీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, పీహెచ్డీ చేసిన వారికి సువర్ణావకాశం. హెచ్పీసీఎల్ కంపెనీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ చేసిన వారికి అనుభవం లేకుండా ఉద్యోగాలను అందిస్తుంది. నెలకు 50 వేల నుంచి లక్ష 60 వేల జీతం అందిస్తుంది.

బీటెక్ చేశారా? HP కంపెనీలో జాబ్స్.. లక్షా 60 వేల జీతం! అనుభవం అక్కర్లేదు!

మీరు బీటెక్ చేశారా? అయితే హెచ్పీ కంపెనీ ఆఫర్ చేస్తున్న జాబ్స్ మీ కోసమే. నెలకు లక్షా 60 వేల జీతం ఇస్తుంది. పని అనుభవం అవసరం లేదు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) కంపెనీ పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 247 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంఎస్సీ అర్హతతో పలు పోస్టులను భర్తీ చేస్తుంది. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా ఉండాలని కంపెనీ ప్రకటించింది.

జూన్ 5న ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. హెచ్పీసీఎల్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలానే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అర్హులైన యుఆర్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ. 1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం హాల్ టికెట్స్ జారీ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. అందులో పాసైతే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

పోస్టులు:

  • మెకానికల్ ఇంజనీర్: 93
  • ఎలక్ట్రికల్ ఇంజనీర్: 43
  • సివిల్ ఇంజనీర్: 10
  • కెమికల్ ఇంజనీర్: 7
  • ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్: 5
  • వయసు పరిమితి: 25 ఏళ్లు
  • విద్యార్హత: ఆయా విభాగాలకు సంబందించిన దాంట్లో ఫుల్ టైమ్ 4 ఏళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. 
  • జీతం: 50,000/- నుంచి 1,60,000/-
  • అనుభవం: అవసరం లేదు

సీనియర్ ఆఫీసర్ (సీజీడీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్): 6

  • జీతం: 60,000/- నుంచి 1,80,000/-
  • వయసు పరిమితి: 28
  • విద్యార్హత: మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏదైనా విభాగంలో నాలుగేళ్ళ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 3 ఏళ్లు

సీనియర్ ఆఫీసర్ (సీజీడీ ప్రాజెక్ట్స్): 4

  • జీతం: 60,000/- నుంచి 1,80,000/-
  • వయసు పరిమితి: 28
  • విద్యార్హత: మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏదైనా విభాగంలో నాలుగేళ్ళ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 3 ఏళ్లు

సీనియర్ ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్: 12

  • జీతం: 60,000/- నుంచి 1,80,000/-, 70,000/- నుంచి 2,00,000/-
  • వయసు పరిమితి: 29/32
  • విద్యార్హత: ఎంబీఏ లేదా సేల్స్/మార్కెటింగ్/ఆపరేషన్స్ లో పీజీడీఏ చేసి ఉండాలి. అలానే మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏదైనా విభాగంలో నాలుగేళ్ళ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • పని అనుభవం: సీనియర్ ఆఫీసర్ పోస్టు కోసం 2 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టు కోసం 05 ఏళ్లు

సీనియర్ మేనేజర్: 2

  • జీతం: 90,000/- నుంచి 2,40,000/-
  • వయసు పరిమితి: 38
  • విద్యార్హత: ఎంబీఏ లేదా సేల్స్/మార్కెటింగ్/ఆపరేషన్స్ లో పీజీడీఏ చేసి ఉండాలి. అలానే మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏదైనా విభాగంలో నాలుగేళ్ళ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 11 ఏళ్లు 

మేనేజర్ టెక్నికల్: 2

  • జీతం: 80,000/- నుంచి 2,20,000/-
  • వయసు పరిమితి: 34 ఏళ్లు
  • విద్యార్హత: కెమికల్/పాలిమర్/ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో 4 ఏళ్ల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 9 ఏళ్లు 

మేనేజర్ సేల్స్: 2

  • జీతం: 80,000/- నుంచి 2,20,000/-
  • వయసు పరిమితి: 36 ఏళ్లు
  • విద్యార్హత: కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 4 ఏళ్ల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలానే రెండేళ్ల ఎంబీఏ ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేసి ఉంటే బెటర్. 
  • పని అనుభవం: 9 ఏళ్లు 

డిప్యూటీ జనరల్ మేనేజర్: 1

  • జీతం: 1,20,000/- నుంచి 2,80,000/-
  • వయసు పరిమితి: 34 ఏళ్లు
  • విద్యార్హత: కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 4 ఏళ్ల ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలానే రెండేళ్ల ఎంబీఏ ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేసి ఉంటే బెటర్. 
  • పని అనుభవం: 18 ఏళ్లు 

చార్టెడ్ అకౌంటెంట్స్: 29

  • జీతం: 50,000/- నుంచి 1,60,000/-
  • వయసు పరిమితి: 27 ఏళ్లు

క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్: 9

  • జీతం: 50,000/- నుంచి 1,60,000/-
  • వయసు పరిమితి: 30 ఏళ్లు
  • విద్యార్హత: కెమిస్ట్రీ/ఫిజికల్/ఆర్గానిక్/ఇన్ ఆర్గానిక్/ అనలిటికల్ విభాగంలో ఎంఎస్సీ చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 3 ఏళ్లు 

ఐఎస్ ఆఫీసర్: 15

  • జీతం: ఏడాదికి 15 లక్షలు 
  • వయసు పరిమితి: 29
  • విద్యార్హత: కంప్యూటర్ సైన్స్/ఐటీ విభాగంలో ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ లేదా డేటా సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 2 ఏళ్లు

ఐఎస్ సెక్యూరిటీ ఆఫీసర్: 1

  • జీతం: ఏడాదికి 36 లక్షలు 
  • వయసు పరిమితి: 45 ఏళ్లు 
  • విద్యార్హత: కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఈసీఈ/ఐఎస్ విభాగంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. లేదా ఎంసీఏ చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 12 ఏళ్లు

క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్: 6

  • జీతం: ఏడాదికి 10.2 లక్షలు 
  • వయసు పరిమితి: 30 ఏళ్లు
  • విద్యార్హత: కెమిస్ట్రీ/ఫిజికల్/ఆర్గానిక్/ఇన్ ఆర్గానిక్/ అనలిటికల్ విభాగంలో ఎంఎస్సీ చేసి ఉండాలి. 
  • పని అనుభవం: 3 ఏళ్లు 

ఇవే కాకుండా పీహెచ్డీ, ఎంఈ/ఎంటెక్, అర్హతతో కూడా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్ సహా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.