iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Flipkartలో లక్ష ఉద్యోగాలు.. మీరూ ట్రై చేయండి

  • Published Sep 04, 2024 | 10:14 PM Updated Updated Sep 04, 2024 | 10:14 PM

Flipkart: జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. మీరూ ట్రై చేసి జాబ్ దక్కించుకోండి.

Flipkart: జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. మీరూ ట్రై చేసి జాబ్ దక్కించుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Flipkartలో లక్ష ఉద్యోగాలు.. మీరూ ట్రై చేయండి

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేలు కాదు ఏకంగా లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అంతా తమకు కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ఇక పండగల సీజన్ లో సేల్ ఎక్కువగా ఉంటుంది. ఆఫర్లు ప్రకటించడంతో కస్టమర్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ సమయాల్లో డిమాండ్ కు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచుకునేందుకు అవసరమైన స్టాఫ్ ను రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. పండగల సీజన్ వేళ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లక్ష జాబ్స్ సృష్టించబోతున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. జాబ్ లేని వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.

సప్లై చైన్ విభాగంలో లక్ష ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. సప్లై చైన్ విభాగంలో ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్ హౌస్ అసోసియేటర్లు, లాజిస్టిక్స్ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్ట్ నర్స్, డెలివరీ డ్రైవర్స్ వంటి ఉద్యోగాలు ఉండనున్నాయి. కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునే వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఐటీబీపీ నాన్ గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) గ్రూప్ సీ విభాగంలో కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 819 పోస్టులను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటుగా కిచెన్ కోర్స్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధృవ పత్రాల పరీశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 21,700-69,100 చెల్లిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.